ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్ కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు: బాలకృష్ణ - తెదేపా మహానాడు

రెండో రోజు మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. ఎన్టీఆర్​ను అనుకరించేవారు కాకుండా.. అనుసరించే వారు కావాలని ఆయన తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈసారి చంద్రబాబు సారధ్యంలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

nandamuri balakrishna
nandamuri balakrishna

By

Published : May 28, 2020, 12:44 PM IST

తన అవసరం ఎప్పుడు ఎక్కడ ఉంటే.. అక్కడ ప్రత్యక్షమవుతానని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన.. ప్రతిపక్షంలో ఇప్పుడే కాదు.. గతంలోనూ ఉన్నామని గుర్తుచేశారు. ఇప్పుడు అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా.. అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈసారి చంద్రబాబు సారధ్యంలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలంతా ఎన్టీఆర్​కు వారసులేనని బాలకృష్ణ తెలిపారు.

ఎన్టీఆర్​ను అనుకరించేవారు కాకుండా.. అనుసరించే వారు కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానస పుత్రికలేనన్న బాలకృష్ణ.. ఆయన కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారన్నారు. మూడు అక్షరాల తెలుగు పదం వింటే తనువు పులకరిస్తుందన్న బాలయ్య.. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే రక్తం ఉప్పొంగుతుందని మహానాడు వేదికగా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా తెలుగు జాతి కీర్తి, ప్రతిష్టలు పెరిగాయన్న బాలకృష్ణ.. ఎన్టీఆర్ తనకు తండ్రి మాత్రమే కాదని గురువు, దైవం కూడా అని వెల్లడించారు.

ఇదీ చదవండి:

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ

ABOUT THE AUTHOR

...view details