ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై నాలుగురోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. పండితులు పూర్ణహుతి నిర్వహించి కార్యక్రమాన్ని పరిసమాప్తి కావించారు.

By

Published : Aug 17, 2019, 11:45 AM IST

పూర్ణాహుతి

ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు కన్నులపండువగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన వేడుకలు పూర్ణాహుతితో సమాప్తమయ్యాయి. యాగశాలలో కలశప్రతిష్ఠ చేసి మూలమంత్ర హవనాలు, శాంతి పౌష్టిక హోమాలను రుత్వికులు నిర్వహించారు. పూజాద్రవ్యాలు ఉంచిన పట్టు చీరను వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ హోమగుండంలో ఆగ్నిదేవునికి సమర్పించడంతో మహాపూర్ణాహుతి తంతు ముగిసింది. కలశ ఉద్వాసన, ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తోపాటు ఉపాలయాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకు అలంకరించిన పవిత్రాలను తీసి భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈవో కోటేశ్వరమ్మ, వైదిక కమిటీ సభ్యులు శివప్రసాదశర్మ తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతుండడంతో కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ నదీమాతకు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details