రాష్ట్రంలో కోటిమంది పైగా కొవిడ్ వ్యాక్సిన్(covid vaccine) తీసుకున్నారని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,00,17,712 మంది కరోనా టీకా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వీరిలో 74,92,944 మంది మొదటి డోసు తీసుకోగా.. 25,24,768 మంది రెండు డోసులు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒక్కరు కరోనా టీకాను ఒక్క డోసైనా తీసుకున్నారని నోడల్ అధికారి తెలిపారు.
vaccination: రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురులో ఒక్కరికి వ్యాక్సిన్ - corona news in ap
రాష్ట్రంలో ప్రతి ఏడుగురులో ఒక్కరు కరోనా టీకాను వేయించుకున్నారని నోడల్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 17 వేల మంది కొవిడ్ వ్యాక్సిన్(covid vaccine) తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా వ్యాక్సినేషన్