కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలయం పక్కనే ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గోశాల ఉంది. గోపూజ కోసం గోవును ఆలయానికి తీసుకొస్తారు. ఈక్రమంలో పూజ ముగించుకుని గోశాలకు వెళ్తుండగా మార్గ మధ్యలో విద్యుత్ ట్రాన్స్ పార్మర్ దగ్గర ప్రమాదవ శాత్తు ఆవు షాక్కు గురైంది. వేల మంది భక్తులతో పూజలు అందుకున్న గోమాత మృతి చెందటం భక్తులను బాధించింది. ఆలయ అధికారులు వెంటనే డాక్టర్ను పిలిపిస్తే గోమాత బతికేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోపిదేవిలో విద్యుదాఘాతం... 'గోమాత' మృతి - mopidevi_temple
శ్రీవల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ముందు భక్తులచే పూజలందుకునే గోమాత గోశాలకు వెళుతోంది. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో మృతి చెందింది.
విద్యుత్ షాక్ తో గోమాత మృతి
ఇవి చదవండి....ఈనెల 21 నుంచి వైకుంఠపురం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
Last Updated : May 14, 2019, 7:49 PM IST