'ఆవుల మృతి కారకులపై కఠిన చర్యలు తప్పవు' - tadepalli
తాడేపల్లి గోశాలలోని ఆవుల మృతిపై విచారణ చేపడతామని పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. గోవుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'
తాడేపల్లి గోశాలలోని ఆవుల మృతిపై శాఖాపరమైన విచారణ చేపడతామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆవుల మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే విచారణ చేపట్టి సహజ మరణమా ? లేక మరే ఇతర కారణముందా ? అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.గోవుల రక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై గోశాలల్లోని ఆవుల పరిస్థితిపై పశుసంవర్థక శాఖ అధికారులతో తరచూ తనిఖీలు చేయిస్తామని తెలిపారు.