బిడ్డలకు విషమిచ్చి... తానూ ఆత్మహత్య - krishna dist
కన్నతల్లే బిడ్డలకు విషమిచ్చింది... తరువాత తాను బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణాజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు శివారలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలచివేసింది.
బిడ్డలకు విషమిచ్చి... తానూ ఆత్మహత్య
కన్నతల్లే బిడ్డలకు విషమిచ్చింది...ఆ తరువాత తాను బలవన్మరణానికి పాల్పడింది.కృష్ణాజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు శివారలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలచివేసింది.
ఆదివారం...గొల్లగూడంలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గొల్లగూడేనికి చెందిన కట్టా త్రిమూర్తులతో గుడివాడకు చెందిన అశ్విని(29)కి అయిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె శర్వాణీప్రియ(5), కుమారుడు కిరణ్ తేజ(2 ) సంతానం. మొదటి నుంచి అత్తింటివారితో విభేదాలు. ఆర్థిక పరంగా ఇబ్బందులేమీ లేవు. ఆదివారం మధ్యాహ్నం కూర తాలింపు మాడిందని భర్త గట్టిగా కేకలు వేయడంతో అశ్విని మనస్తాపానికి గురైందని పోలీసులు తెలిపారు.
సున్నిత మసస్కురాలైన ఆమె ఆ బాధను దిగమింగుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి...తాను కూడా తాగేసింది.ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు కైకలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అశ్విని,కిరణ్ తేజ్ లు అప్పటికే మరణించారు.ప్రాణాలతో పోరాడుతున్న శర్వాణీప్రియని మెరుగైన వైద్యం కోసం తండ్రి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.