తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్ అయింది. ఇళ్లలో మధ్యనుంచి వెళ్తున్న పైపులైన్ లీక్ అవడంతో కాలనీలోని రహదారులు జల మయమయ్యాయి. నీటి ప్రవాహం ఆకాశగంగను తలపించింది.
'భగీరథుడు' బయటకొచ్చాడు... ఆకాశగంగను తెచ్చాడు..!
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఆకాశగంగ కనిపించింది. కాకపోతే ఆకాశం నుంచి కాకుండా.. భూమి నుంచి పొంగిపొర్లింది. మిషన్ భగీరథ పైపు లైన్‌కు పడ్డ లీకేజీ భారీ ఫౌంటెన్‌ను తలపించింది. ఈ దృశ్యం చూసిన వారంతా ఆకాశ గంగ కిందకి వచ్చిందా అన్నట్లు ఆశ్చర్యపోయారు.
మంచిర్యాలలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్
సుమారు 60 అడుగుల ఎత్తు వరకు నీళ్లు ఎగసిపడ్డాయి. కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు మిషన్ భగీరథ పైపులైను నీటి సరఫరా నిలిపివేశారు.
ఇదీ చూడండి.'జగనన్న పచ్చతోరణం' ప్రారంభం