కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి గ్రామానికి చెందిన పుల్లారావు.. ఐదు సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. మానసిక సమస్యతో బాధపడుతూ తమిళనాడులోని శివగంగి జిల్లాకు చేరుకున్నాడు. చెన్నైకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ పుల్లారావును గుర్తించి చేరదీసింది. అతనికి చికిత్స అందించి, పూర్వస్థితికి తీసుకువచ్చారు. పుల్లారావు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పేరు, ఫొటో, వివరాలను విజయవాడ పోలీస్ కమిషనర్‌కు పంపించారు.
ఐదేళ్ల క్రితం తప్పిపోయి..పోలీసుల సహకారంతో.. - latest news in krishna district
ఐదు సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి ఆచూకీని విజయవాడ పోలీసులు కనుగొని.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. చెన్నైకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ సహకారంతో బాధితుడిని వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు.
వ్యక్తి ఆచూకీ లభ్యం
విజయవాడ నగర కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు విజయవాడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తప్పిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను గుర్తించారు. వారిని తమిళనాడుకు పంపించి పుల్లారావును వారికి అప్పగించారు. ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎన్జీఓ సంస్థను, పోలీసులను బాధిత కుటుంబసభ్యులు అభినందించారు.
ఇదీచదవండి.