కృష్ణా జిల్లాలోని చందర్లపాడు, కంచికచర్ల, వత్సవాయి, తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలాల్లో మిర్చి బస్తాలు దొంగతనం చేస్తున్న ఇద్దరిని చందర్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఆనంద్ రావు, సైదేశ్వరరావుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 96 టిక్కీల మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటికే వీరిపై 6 కేసులు ఉన్నట్టు వివరించారు. ఉదయం బైక్ మీద అంతా పరిశీలించి.. రాత్రి సమయంలో బస్తాలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మిర్చి బస్తాల దొంగలు అరెస్టు - madhira
కృష్ణా జిల్లా, తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో మిర్చి బస్తాలు దొంగతనం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
మిర్చి దొంగలు