గృహనిర్మాణాల కోసం వినియోగదారులకు సులువుగా ఇసుకను సరఫరా చేయాలని మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్, వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి ఇసుక సరఫరాలో ఉన్న ఇబ్బందులపై సమీక్షించారు. వినియోగదారునికి ఇసుక చేరడంలో ఎలాంటి మోసాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా రాతి ఇసుకను నిర్మాణాలకు వినియోగించేలా చూడాలని చెప్పారు. సెప్టెంబరు 5 తర్వాత కొత్త ఇసుక విధానం రానుందని... అంతవరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇసుకను అందించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇసుక కావాల్సిన వారు సంబంధిత మండల తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
''ఇసుక సరఫరాలో సమస్యలు రానీయకండి'' - tele conference
విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు కలిసి వినియోగదారులకు ఇసుక లభ్యం కావటంలో ఉన్న ఇబ్బందులపై సమీక్షించారు.
మంత్రులు