ప్రభుత్వ అధికారులతో మంత్రుల బృందం సమావేశమైంది. కృష్ణా నది వరద ప్రవాహంపై సమీక్షించి తగు సూచనలు చేశారు. విజయవాడలోని మోడల్ గెస్ట్ హౌస్‌లో మంత్రులు అనిల్‌కుమార్, బొత్స, వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలును అప్రమత్తం చేశారు.
వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
నాలుగు రోజులుగా ప్రశాంతంగా ఉన్న కృష్ణా నది శుక్రవారం ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ఉద్ధృతి పెంచుకుంటూ..బెంబేలెత్తిస్తోంది. ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో వరద పరిస్థితిని సమీక్షిస్తూ..అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఉన్నతాధికారులతో సమావేశమై అప్రమత్తం చేసింది.
వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు