ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి - minister
వరదతో నిండిన ముంపు ప్రాంతాలను మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. పునరావస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రీటెయినింగ్ వాల్ నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
minister-visit-flood-areas
విజయవాడ సమీపంలో కృష్ణా నదిని ఆనుకుని రీటైనింగ్ వాల్ నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. నగరం పరిధిలోని ముంపు ప్రాంతాలైన కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్, భవానీపురంలో ఆయన పర్యటించారు. రీటైనింగ్ వాల్ నిర్మించాలన్న స్థానికుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. వరద ఉద్ధృతి దృష్ట్యా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని స్థానికులను విజ్ఞప్తి చేశారు.