డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ - drinages
రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ap minister
వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా ఉండేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు . సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక తయారుచేయాలని అధికారులను కోరారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వెల్లంపల్లి విజయవాడలోని.....ఆర్.ఆర్.అప్పారావు వీధి, వినుకొండ వారి వీధి, గీతా మందిరం, కాళేశ్వరం మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భూగర్భ డ్రైనేజీతో పడుతున్న ఇబ్బందులను స్థానికులు మంత్రికి వివరించారు.