జామాయిల్, సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జామాయిల్, సుబాబుల్ సాగు చేసే రైతులు, రైతు సంఘాల నేతలు సహా పలు పేపర్ మిల్లుల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను మంత్రికి వివరించారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టాలపాలవుతున్నట్లు రైతులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన తోటలకు ఎకరాకు 25 వేల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. దళారీల వల్ల నష్టపోతున్నట్లు రైతులు వాపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పంటను కొనుగోలు చేయాలని కోరారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు.
జామాయిల్, సుబాబుల్ రైతులతో మంత్రి సమీక్ష - subabul
జామాయిల్, సుబాబుల్ రైతులతో మంత్రి మోపిదేవి వెంకటరమణ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి సమీక్ష