మైనింగ్, గ్రానైట్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ గ్రానైట్ అసోసియేషన్ కోరింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద మైనింగ్ శాఖ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మైనింగ్, గ్రానైట్ పరిశ్రమల ప్రతినిధులు భేటీ అయ్యారు. కొవిడ్ వల్ల గత 4 నెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని వారు మంత్రికి తెలిపారు. వలస కూలీలంతా సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారని ప్రభుత్వ పరంగా రాయితీలు మరింతగా ఇవ్వాల్సిన అవసరం ఉందని మైనింగ్ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం నుంచి సహకారం కావాలని.. రాయితీలు కల్పిస్తే మరింత మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో పాలసీలు ఎలా ఉన్నాయో నివేదిక ఇవ్వండి: మంత్రి - ఏపీలో మైనింగ్ పరిశ్రమలు
మైనింగ్, గ్రానైట్ పరిశ్రమలను ఆదుకోవాలని ఏపీ గ్రానైట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.
minister pedhireddy
పరిశ్రమను ఆదుకునేందుకు రోబో సాండ్‌కు అనుమతులు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కరోనాతో అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. నివేదిక అందగానే ముఖ్యమంత్రితో చర్చించి పాలసీని రూపొందిస్తామన్నారు. వ్యాపారుల సమస్యలు ప్రభుత్వానికి తెలుసని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా... జీహెచ్ఎంసీలో 62శాతం కేసులు