భయంతోనే వైకాపా దాడులు చేస్తోంది: జవహర్
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా భౌతిక దాడులకు తెగ పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.
కృష్ణాజిల్లా తిరువూరు మండలం అక్కపాలెం లో వైకాపా కార్యకర్త కత్తితో దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మరియదాసు పద్మ శ్రీను మంత్రి జవహర్ పరామర్శించారు. పద్మ శ్రీనుతిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు.ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని పార్టీపరంగా అండగా ఉంటామని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తలు సమయమనం సాధించాలని ప్రతి దాడులకు పాల్పడ వద్దని సూచించారు.గ్రామాల్లో తాము ప్రత్యేకంగా దళాలను ఏర్పాటు చేసుకోగలమని...పార్టీ సిద్ధాంతాలు అధినేత నైజం అలాంటిది కాదని తెలిపారు.దాడులకు పాల్పడేవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.