కృష్ణా జిల్లా గుడివాడలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.. హాత్వే కేబుల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. గుడివాడలోని ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మున్నలూరు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో 12 మండలాల్లో కేబుల్ నెట్వర్క్ సేవలు అందుబాటులో ఉంటాయని.. అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసంస్థ రాష్ట్ర డిస్ట్రిబ్యూటర్ రమేష్, స్థానిక డిస్ట్రిబ్యూటర్ శంకర్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
గుడివాడలో హాత్వే కేబుల్ నెట్వర్క్.. ప్రారంభించిన మంత్రి - Gudiwada Latest News
గుడివాడలో హాత్వే కేబుల్ నెట్‌వర్క్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. కేబుల్ సేవలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
నూతన కేబుల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన మంత్రి