ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలివిడతలో గుడివాడ, మచిలీపట్నం ఎంపిక : మంత్రి కొడాలి

కృష్ణాజిల్లా గుడివాడలో మధ్య తరగతి వర్గాలకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు అందించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న స్మార్ట్ టౌన్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్ జగనన్న స్మార్ట్ టౌన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను జేసీ మాధవీలత, పలువురు అధికారులతో కలిసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు.

minister kodali nani tour in gudivada constituency
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

By

Published : Apr 28, 2021, 10:58 PM IST

గుడివాడ మండల పరిధిలోని దొండపాడు, బేతవోలు, లింగవరం, బొమ్ములూరు గ్రామాల్లో స్మార్ట్ సిటీ నిర్మాణానికి అనువైన భూములను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఆయన వెంట జేసీ మాధవీలత, పలువురు అధికారులు ఉన్నారు. వైఎస్సార్ జగనన్న స్మార్ట్ టౌన్ పథకం తొలివిడతలో గుడివాడ, మచిలీపట్నంలు ఎంపికైనట్లు మంత్రి తెలిపారు. గుడివాడ పురపాలక సంఘం పరిధిలో... జగనన్న స్మార్ట్ టౌన్ లే-అవుట్ ప్లాట్లకు ఇప్పటివరకు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details