ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన కొడాలి ప్రీమియర్ లీగ్​..విజేతలకు బహుమతులు ప్రదానం - Minister Kodali Nani participated in kadali Premier League

కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కొడాలి ప్రీమియర్ లీగ్ ముగింపు ఉత్సవాల్లో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. విజేత ఏపీ అడ్వకేట్ జట్టుకు రూ.రెండు లక్షల ప్రైజ్ మనీ, రన్నర్ పశ్చిమ గోదావరి జట్లకు లక్ష రూపాయల ప్రైజ్ మనీని ప్రదానం చేశారు.

Minister Kodali Nani
మంత్రి కొడాలి నాని

By

Published : Apr 26, 2021, 1:51 PM IST

కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కొడాలి ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రైజ్ మనీ అందజేశారు. ఐపీఎల్ తరహాలో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్​ పాలేటి చంటి, మెరుగుమాల కాళీలను అభినందించారు.

ఈ టోర్నీలో మొత్తం 27 మ్యాచ్​లు జరిగాయని, ఫార్మర్​ ఐపీఎల్ ప్లేయర్స్​ అయిన కార్తికేయన్, స్నేహ కిషోర్.. వంటి వారు పాల్గొనటం సంతోషకరమన్నారు.

ఇదీ చదవండీ..శ్రీకాళహస్తీశ్వరాలయంలో కరోనా నివారణ చర్యలు.. తగ్గిన భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details