ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలు వచ్చినప్పుడు లోకేశ్ ఎక్కడ ఉన్నారు..? మంత్రి కొడాలి నాని - లోకేశ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ వార్తలు

వరదలు వచ్చినప్పుడు లోకేశ్ ఎక్కడ ఉన్నారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఇవాళ జిల్లా పర్యటనల పేరుతో వరద బాధితులను పరిశీలిస్తున్నారని దుయ్యబట్టారు.

minister kodali nani
minister kodali nani

By

Published : Oct 27, 2020, 3:27 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు లోకేశ్ ఎక్కడో ఉండి... ఇవాళ పర్యటనల పేరుతో పరిశీలిస్తున్నారని ఎద్దేవా చేశారు. నందిగామలో రైతు భరోసా రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details