కరోనా వ్యాప్తి విస్తృతమైన కారణంగా.. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాత్ర మరింత కీలకమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ లావాదేవీలు పెరిగిన దృష్ట్యా.. సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు మంత్రి వెల్లడించారు. ఐటీ శాఖపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరలో కొత్త పారిశ్రామిక విధానంతో పాటు.. ఐటీ పాలసీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
త్వరలో కొత్త పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీ: మంత్రి గౌతమ్ రెడ్డి
రాష్ట్రంలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడుల ఆకర్షణ పైనే.. ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు. త్వరలో కొత్త పారిశ్రామిక విధానంతో పాటు.. ఐటీ పాలసీని ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ లావాదేవీలు పెరిగిన దృష్ట్యా.. సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడుల ఆకర్షణ పైనే.. ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇ-ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా వేగంగా సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే విషయంపై కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్హతలు, అవకాశాలను బట్టి నేరుగా ఉపాధి వివరాలు తెలుసుకునేలా ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మరోవైపు ప్రభుత్వ శాఖల కొనుగోళ్లకు సంబంధించి ఏపీటీఎస్, మీసేవా విభాగాలు గ్రామ సచివాలయాల పరిధిలోకి తెచ్చే అంశంపైనా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఎటువంటి సమస్య రాకుండా చూడాలని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:బంగారం భగభగ- రూ.52వేలకు చేరువ