దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బృందం కలిసింది. ఈ బృందంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్, నీటిపారుదలశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌లు ఉన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఈ బృందం కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించింది. పోలవరం పెండింగ్ బిల్లులు, ఇతర అంశాలపై భేటీలో మాట్లాడారు. కరోనా వల్ల...రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పన్ను రాబడి లేనందున కేంద్ర సహాయం కోరామని... రాష్ట్రానికి వచ్చే నిధులను గురించి అడిగామని తెలిపారు. పోలవరంలో బిల్లింగ్ జరిగిన 3,500 కోట్లు మనకు రావాలని..వాటిని అడిగామని అన్నారు. పునర్ వ్యవస్థకరణ చట్టంలో మనకు రావాల్సిన రెవెన్యూ బకాయిలను..కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించవచ్చని వెల్లడించారు.