minister botsa on employees demands: ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరికాదన్నారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు తాము చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. ఉద్యోగస్థులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చించి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. జీవోలు ఇచ్చి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని, వాటన్నిటినీ పరిశీలించి.. ఆలోచిస్తామన్నారు. ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు... కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని బొత్స అభిప్రాయపడ్డారు.
వారి ట్రాప్లో పడొద్దు - శ్రీకాంత్ రెడ్డి
srikanth reddy on employees demands : ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఎపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరిస్తుందన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదని.., ఉద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఆందోళనలపై ఉద్యోగులు పునరాలోచన చేయాలని కోరారు.