ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దుకు కూలీలు... పరిమితంగా అనుమతులు!

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయిప్పటికీ క్షేత్రస్థాయిలో వలసదారులు ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నారు. తెలంగాణ నుంచి రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్న వలస కూలీలను పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. తెలంగాణ ఉన్నతాధికారుల వివరణ అనంతరం పేర్లు నమోదు చేసుకున్న కూలీలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

By

Published : May 3, 2020, 5:23 PM IST

migrant labగరికపాడు సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద వలస కూలీల ఇబ్బందులుors agitation
migrant laboగరికపాడు సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద వలస కూలీల ఇబ్బందులుrs agitation

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద.. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతులు లేక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్టానికి చెందిన వలసదారులు తెలంగాణ రాష్ట్రంలో కూలీ పనులకు వెళ్లి లాక్​​డౌన్​ కారణంగా చిక్కుకుపోయారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కొంత వెసులుబాటు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్ర సరిహద్దుకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదు. ఈమేరకు తెలంగాణ ఉన్నతాధికారుల వివరణ నిమిత్తం పేర్లు నమోదు చేసుకున్న వలస కూలీలను మాత్రమే అనుమతిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details