కరోనా నివారణ చర్యలకు తమవంతు సాయంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మెప్మా ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 8 లక్షల 10 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమక్షంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... యాచకులకు, పేదలకు స్థానిక పాఠశాలలో భోజన ఏర్పాటు కార్యక్రమంలో మెప్మా ఉద్యోగులు ప్రతిరోజు బాధ్యతగా ఏర్పాట్లు చూస్తున్నారని కితాబిచ్చారు.
సీఎం సహాయ నిధికి మెప్మా ఉద్యోగుల విరాళం - jaggayyapeta mepma employees donation
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మెప్మా ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ నిర్మూలకు సీఎం సహాయ నిధికి 8 లక్షల 10 వేల చెక్కును అందించారు.

సీఎం సహాయ నిధికి మెప్మా ఉద్యోగుల విరాళం