జులై నాటికి ఆదివాసీలను అడవుల నుంచి ఖాళీ చేయించాలన్న సుప్రీం కోర్టు తీర్పు ఎంతోమంది గిరిజనులకు అన్యాయం చేసేదిగా ఉందని రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఝాన్సీ ఆవేదవ వ్యక్తం చేశారు. విజయవాడలో ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ... అడవిలో నివసించే ఆదివాసీల హక్కును పరిరక్షించాలని, వారిని అడవి నుంచి పంపించే చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని కోరారు.
"పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి" - సుప్రీం తీర్పు వ్యతిరేకత
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే... పనులు చేపట్టాలని రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ కోరారు. సుప్రీం తీర్పు గిరిజనులకు అన్యాయం చేసేదిగా ఉందని ఆమె అన్నారు.
కరపత్రాలను చూపిస్తున్న రైతుకూలి సంఘ సభ్యులు