mechanic made a battery vehicle: అసలే పేదరికం, చదివింది అంతంతా మాత్రమే.. పైగా పెరుగుతున్న నిత్యావసర ధరలు గుదిబండల మారి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అతడిది. దొరికిన కొద్దిపాటి పనితో ఎలాగోలా కుటుంబాన్ని పోషించాలనే తాపత్రయం పడ్డాడు. కానీ, ఇంధన ధరలు పెరగటం మూలానా పని కోసం ఖర్చు చేసే రవాణా చార్జీలు రోజురోజుకు పెరుగుతూ భారంగా మారాయి.దాంతో బ్యాటరీతో నడిచే వినూత్న వాహనం తయారు చేశాడు. మరి, ఇందంతా అతడికి ఎలా సాధ్యమైంది..? ఆ బ్యాటరీ వాహనం ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నిత్యవసర సరుకుల్లో ఒకటిగా భావించే వాహనాల్లో ఉపయోగించే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం ఈ ధరలను దృష్టిలో ఉంచుకొని ఆ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఊరట కల్పించటానికి తన వంతుగా కృషి చేసి... ఆటో మోబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరకు నాంది పలికాడు మోర్ల వెంకటేశ్వరరావు. కృష్ణ జిల్లా కంకిపాడుకు చెందిన వెంకటేశ్వరరావు కుటుంబ ఆర్థిక పరస్థితుల కారణంగా పదొవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తర్వాత వెంకటేశ్వరరావు బ్యాటరీ మరమ్మతులు.. చేసి వాహనాలకు అమర్చే వృత్తిని ఎంచుకున్నాడు. ఆ పనిపైఇరవై ఏళ్ల అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు.
Young Boy 3D Art with Technology: శిల్పకళకు సాంకేతిక త్రీడీ హంగులు.. జీవం ఉట్టిపడుతున్న విగ్రహాలు
ఈ క్రమంలో అతడు నిరంతరం ఇంటి నుంచి షాప్‌కు రాకపోకలు కొనసాగించేవాడు. దీంతో రవాణా ఖర్చులకు అతడు రోజుకు యాభై రూపాయలు భరించాల్సి ఉండేది.. దానిని వెంకటేశ్వరరావు అదనపు భారంగా భావించాడు. దాన్ని తగ్గించుకునేందుకు తన అనుభవాన్ని జోడించి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాను ఎదుర్కొంటున్న భారాన్ని తన చుట్టు ఉన్న వారు అనుభవించటం... వెంకటేశ్వరరావు గమనించాడు. ముఖ్యంగా మోపెడ్‌పై ఊరురా తిరుగుతు చిన్న చితకా వ్యాపారాలు చేసుకొనే వ్యాపారులకు.. పెరుగుతున్న ధరల వల్ల వచ్చిన ఆధాయం అంతా వాటికే సరిపోతుందని తెలుసుకున్నాడు. విద్యుత్ వాహనాలు అంతే మొత్తంలో అధిక ధరలు వసూలు చేయడం... వాటి నుంచి ఉపశమనం పొందేందుకు మరో మార్గాన్ని అన్వేషించాడు