ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షా కేంద్రాల్లోకి 'మైక్రో స్లిప్పులు'! - slips

కృష్ణా జిల్లా తిరువూరు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మాస్​ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. విద్యా సంస్థల నిర్వాహకులు.. ర్యాంకుల కోసం కక్కుర్తి పడుతూ పరీక్ష కేంద్రాల లోపలికి మైక్రో జిరాక్స్ స్లిప్పులు పంపిస్తున్నారు. ఈ ఉదంతం ఈనాడు, ఈటీవీ నిఘాకు చిక్కింది.

పరీక్షా కేంద్రాల్లోకి 'మైక్రో స్లిప్పులు'!

By

Published : Mar 20, 2019, 4:52 PM IST

పరీక్షా కేంద్రాల్లోకి 'మైక్రో స్లిప్పులు'!
తిరువూరులో పదో తరగతి పరీక్షల నిర్వహణ నిమిత్తం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 18 న పరీక్షలు ప్రారంభం కాగా... మొదటి రోజు నుంచే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కేంద్రాల వద్ద తిష్టవేసి విద్యార్థులకు స్లిప్పులందిస్తున్నట్టు బయటపడింది. బిట్​ పేపర్ జవాబులు ఇన్విజలేటర్లు అందించేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు తేలింది.

''పరీక్ష ప్రారంభమైన అరగంటకే వాట్సాప్​ ద్వారా పరీక్ష పేపరు బయటకు వెళ్తోంది. వీటి ఆధారంగానే ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల ప్రహరీ గోడల చుట్టూ తిరుగుతూ జవాబు పత్రాలను లోపలికి పంపిస్తున్నారు'' అని కొందరు తల్లిదండ్రులు ఈటీవీ - ఈనాడుకు సమాచారం అందించారు. వెంటనే.. ఈనాడు - ఈటీవీ రంగలోకి దిగింది. పరీక్ష కేంద్రాల వద్ద జవాబు పత్రాలు లోనికి పంపిస్తున్న వారిని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గమనించిన కాపీ మాస్టర్లు.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

విషయాన్ని నూజివీడు విద్యాశాఖ ఉన్నదాధికారుల దృష్టికి తీసుకెళ్లగా... సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details