ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే 30న అసెంబ్లీ ముట్టడి''

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సీఎం జగన్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకుంటే ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడి : మందకృష్ణ మాదిగ

By

Published : Jul 24, 2019, 9:11 PM IST

ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడి : మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పడం మాదిగలను అవమానించడమే అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. 10 రోజులు దాటుతున్నా.. సీఎం తన మాటలు ఉపసంహరించుకోకపోవడం సరికాదన్నారు. మాదిగలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోందని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు, నిరసనలకు పిలుపునిచ్చిన ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఆందోళనలో పాల్గొన్నారు. తెదేపా, భాజాపా నాయకులు మద్దతు ఇచ్చారు. గతంలో జగన్ ఎస్సీ వర్గీకరణకు మద్దతునిచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. జగన్ తమకు సమాధానం చెప్పి వ్యాఖ్యలు ఉపసంహరించుకోక పోతే ఈ నెల 27 వరకు రిలే దీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details