ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవడైతే నాకేంటి? మా నాన్న ఎమ్మెల్యే...! - psamaneni prasad

ఏమి జరిగినా కాపాడడానికి తన తండ్రి ఉన్నాడనుకుని... ఓ ఎమ్మెల్యే కుమారుడు నిబంధనలు అతిక్రమిస్తూ, అడ్డుకోబోయిన పోలీసుపై దాడి చేశారు.

arrest

By

Published : Jul 31, 2019, 7:37 PM IST

వైకాపా ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్​భాను కుమారుడు ప్రసాద్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకున్నాడన్న ఆరోపణలతో.. జైలుకు తరలించారు. ఆ రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రసాద్... హైదరాబాద్ హైటెక్స్ కమాన్​ వైపు నుంచి నిబంధనలు అతిక్రమించి కారు నడిపాడు. ఖానామెట్​ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్​ కృష్ణ వారిని అడ్డుకున్నాడు.

కారులోంచి దిగిన ప్రసాద్... కానిస్టేబుల్​తో వాగ్వాదానికి దిగాడు. నన్ను నువ్వు అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్​ను దుర్భాషలాడాడు. రోడ్డుకు అవతలివైపు విధులు నిర్వహిస్తున్న మాదాపూర్ సీఐ రాజగోపాల్​రెడ్డి అక్కడకు చేరుకుని వారించే ప్రయత్నం చేశారు. సామినేని ప్రసాద్ వినకపోవడం వల్ల స్టేషన్​కు రావాల్సిందిగా ఇన్​స్పెక్టర్ కోరారు.

నన్న స్టేషన్​కు రమ్మంటావా అంటూ ఇన్​స్పెక్టర్​ను పక్కకు నెట్టి... కాలుతో తన్ని దూషించాడు. విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని మాదాపూర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఎమ్మెల్యే తనయుడిపై 332, 353,506 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details