అబ్కారీ ఉద్యోగులకు శుభవార్త. ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత అబ్కారీ శాఖలో 44 మంది ఉద్యోగులకు పదోన్నతులు దక్కినట్లు ఏపీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం అధ్యక్షుడు బి. నరసింహులు తెలిపారు. ఈ దస్త్రం ఎన్నికల కోడ్ నేపధ్యంలో రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు ద్వారా స్క్రీనింగ్ కమిటీకి చేరింది. కమిటీలో సీఎస్‌తో పాటు సంబంధిత కార్యదర్శి, జిఎడి కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఆమోదం పొందడంతో కమిషన్ అనుమతికి లోబడి వారికి పోస్టింగ్‌లు దక్కనున్నాయి. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర అబ్కారీ కేంద్ర కార్యాలయంలో కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోషియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
అబ్కారీ శాఖలో 44 మంది ఇన్స్స్పెక్టర్లకు పదోన్నతులు - vijayawada
ఆబ్కారీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగుల కల నెరవేరింది. 44మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి.
ఆబ్కారీ శాఖ