ఇప్పటికే కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రా తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి 5 తేదీ వరకు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని ఐఎండి సూచించింది.
నేటి నుంచి ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్షసూచన - ఉభయ గోదావరి జిల్లా
కోస్తాంధ్ర తీరాన్ని అనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తువరకు ఎగసి పడే అవకాశం ఉందని ఆర్టీజిఎస్ వెల్లడించింది. జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచనలు జారీ చేశారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరికలు జారీ చేసింది.
ఇదీ చూడండి పింగళి మ్యూజియం ఏర్పాటు చేయండి'