గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహించింది ఏపీపీఎస్సీనే అని మంత్రులు అంటుంటే... పరీక్ష తాము నిర్వహించలేదని ఏపీపీఎస్సీ చెబుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. ఇంతకీ పరీక్ష పెట్టింది ఎవరు.. అని లోకేష్ మండిపడ్డారు. 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించింది ఎవరు అనేది తెలియదు కానీ, పేపర్ లీకేజి స్కామ్ కి తండ్రి మాత్రం ముఖ్యమంత్రి జగనే అని అన్నారు.
యువత భవిష్యత్తుతో ఆటలొద్దు: లోకేశ్ - నారా లోకేశ్
యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు ఆడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ పరీక్షల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్తుతో ఆటలోద్దు... లోకేశ్