ప్రకాశం బ్యారేజీ గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోటు తియ్యలేని చేతగాని ప్రభుత్వం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేంటని నిలదీశారు. గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలీదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎందుకు అహంకారమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సమక్షంలోనే ఓ అమాయకుని ప్రాణం పోవటం దారుణమన్నారు. ప్రజల రక్షణలో ప్రభుత్వం వంద శాతం విఫలమయ్యిందని విమర్శించారు. ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని... మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
'ప్రజల రక్షణలో ప్రభుత్వం విఫలం' - vijayawada
మంత్రి చూస్తుండగానే ప్రకాశం బ్యారేజీ వద్ద అమాయకుని ప్రాణం పోవటం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
లోకేశ్