కడుపునొప్పి తాళలేక గృహిణి ఉరి వేసుకున్న ఘటన శోభనాపురంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామం సమీపంలో గల శోభనాపురం గ్రామానికి చెందిన వెలివెల మంగారావు కుమార్తె చిన్నమ్మకు 2012 సంవత్సరంలో వివాహం జరిగింది. కొంతకాలంగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఈనెల 18వ తేదీన పుట్టిల్లు శోభనాపురానికి వచ్చింది. ఈక్రమంలో కడుపు నొప్పి విపరీతంగా రావడంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. నూజివీడు రూరల్ సీఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య! - krishna district
కడుపునొప్పి తాళలేక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య!