పెందుర్తి శిరోముండనం ఘటనను నిరసిస్తూ విజయవాడలోని ప్రకాష్ నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాలు నిరసన చేపట్టాయి. దాడులు చేస్తోన్న అగ్రకులాల వారిపై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విశాఖకు తరలి వెళ్లకముందే ఈ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను అరికట్టలేని ప్రభుత్వం... విశాఖకు రాజధాని మారితే ప్రజల భద్రతకు ఏ విధంగా భరోసా ఇస్తారని ప్రశ్నించారు. దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
' పెందుర్తి ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి' - విజయవాడలో నిరసన
విజయవాడ ప్రకాష్ నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెందుర్తి శిరోముండనం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ ప్రకాష్ నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఆందోళన