ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు జరగాల్సిన కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశం వాయిదా.. - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Krishna RMC meeting postponed: కేఆర్​ఎంబీ జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. వచ్చే నెల మూడో తేదీన కమిటీ చివరి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం అందించారు.

Krishna River Ownership Board
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

By

Published : Nov 24, 2022, 11:46 AM IST

Krishna RMC meeting postponed: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. జల విద్యుత్ ఉత్పత్తి, రూల్ కర్వ్స్​, వరద జలాల వినియోగానికి సంబంధించిన విధివిధానాల ఖరారు, నివేదికపై సంతకం కోసం ఆర్​ఎంసీ తుది సమావేశం ఇవాళ జరగాల్సి ఉంది. గతంలో జరిగిన కమిటీ సమావేశాలకు రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు. దీంతో తుది సమావేశాన్ని నిర్వహిస్తున్నామని.. ఎవరు రాకపోయినా, ఏకాభిప్రాయం రాకపోయినా అదే విషయాన్ని బోర్డుకు నివేదిస్తామని తెలిపారు. లక్ష్య సాధనలో ఆర్​ఎంసీ వైఫల్యం చెందినట్లు పేర్కొంటామని అన్నారు.

అయితే తమకు ముందుగానే నిర్ణయించిన సమావేశాలు ఉన్న నేపథ్యంలో తాము హాజరు కాలేమని, సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ జెన్​కో అధికారులు బోర్డును కోరారు. వచ్చే వారం ఆర్ఎంసీ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన ఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేశారు. వచ్చే నెల మూడో తేదీన కమిటీ చివరి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం అందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details