KRMB meeting postponed to January 11: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల 6వ తేదీన బోర్డు 17వ సమావేశం నిర్వహించనున్నట్లు మొదట కేఆర్ఎంబీ ప్రకటించగా.. అదే నెల 5, 6వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నేషనల్ వాటర్ మిషన్ ఆధ్వర్యంలో నీటిపారుదల అంశాలకు సంబంధించి.. అన్ని రాష్ట్రాల మంత్రుల మొదటి జాతీయ స్థాయి సమావేశం జరగనుంది. వాటర్ విజన్ - 2047 థీమ్‌తో ఈ భేటీని ఏర్పాటు చేశారు.
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం మళ్లీ వాయిదా.. ఈసారి ఎప్పుడంటే? - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా
KRMB Meeting Postponed: తెలంగాణలో వచ్చే నెల 6వ తేదీన జరగబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. అదే నెల 5,6 వ తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నేషనల్ వాటర్ మిషన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో.. బోర్డు సమావేశం అదే నెల 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కేఆర్‌ఎంబీ ప్రకటించింది.
KRMB
దీంతో వచ్చే నెల 6న ప్రతిపాదించిన బోర్డు సమావేశాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వాయిదా వేసింది. వచ్చే నెల 11న కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. బోర్డు సమావేశంలో చర్చించేందుకు వీలుగా ఎజెండా ప్రతిపాదిత అంశాలను ఈ నెల 26వ తేదీ వరకు పంపాలని కోరింది.
ఇవీ చదవండి: