ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగు నీరు అందిస్తున్న కృష్ణమ్మ ప్రక్షాళనకు అధికారులు నడుం బిగించారు. కృష్ణా నది ప్రక్షాళనకు సంబంధించిన గోడ పత్రికలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాలక కమిషనర్ రామారావుతో కలిసి విడుదల చేశారు. 2,3 తేదీల్లో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతీ నెలా కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. నగరం నుంచి వచ్చే మురుగునీరు నదిలో కలవకుండా చర్యలు తీసుకోనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు.. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. కృష్ణమ్మ శుద్ధి సేవలో 'నేను సైతం' అనే నినాదాన్ని ఇవ్వడం ద్వారా నది ప్రక్షాళనలో భాగం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
కృష్ణమ్మ శుద్ధి సేవలో.. 'నేను సైతం' - vijayawada
కృష్ణా నది ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. అందుకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఇంతియాజ్, నగర పాలక కమీషనర్ రామారావు విడుదల చేశారు.
కృష్ణానది ప్రక్షాళన