ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు... వరదలో లంక గ్రామాలు

కృష్ణమ్మ వరద ప్రవాహంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. వరద ఉద్ధృతితో రాకపోకలు స్థంభించి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షింగా బయటకు తరలిస్తున్నారు.

కృష్ణమ్మ వరద పరవళ్లు... నట్టేట లంక గ్రామాలు

By

Published : Aug 14, 2019, 1:23 PM IST

కృష్ణమ్మ వరద పరవళ్లు... నట్టేట లంక గ్రామాలు

కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. జలాశయాలు నిండుకుండలా మారాయి. గేట్లు ఎత్తి వరద నీటిని అధికారులు కిందికి పంపుతున్నారు. వరద ప్రవాహం తట్టుకోలేక లంక గ్రామాలు మునిగిపోయాయి. తోటవల్లూరు మండలంలోని లంక గ్రామాలను వరద చుట్టుముట్టింది. తోడేలుదిబ్బలంక, కాలినదిబ్బలంక, పాములలంకలో పసుపు, కంద, అరటి పంటలు నీట మునిగాయి.

  • గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో 100 ఎకరాల పంట నీటమునిగింది... సీతానగరంలోని శివాలయం జలదిగ్బంధమైంది.
  • కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద కృష్ణా నదిలో పట్టుపురుగులకు మేత వేసేందుకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. వీరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
  • ఇప్పటికే వరద ఉద్ధృతిని మంత్రులు, కలెక్టర్లు, అధికారులు సమీక్షిస్తున్నారు. లంక గ్రామాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చల్లపల్లి మండలం నిమ్మగడ్డ, వెలివోలు, నడకుదురు రేవులో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున.. ప్రజలు రేవుల లోపలికి వెళ్లొద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details