కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి - సబ్ కలెక్టర్
నిబంధనలు పాటించకుండా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోన్న ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ మిషా సింగ్ హెచ్చరించారు. కాలుష్య నివారణ కోసం పరిశ్రమల యాజమాన్యాలు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
krishna_district_sub_collector_mishasingh_inspection
విజయవాడ కబేళాలో ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీని సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీసీబీ, విద్యుత్, పరిశ్రమల శాఖ అధికారులతో కలసి అనుమతి పత్రాలను, ప్లాస్టిక్ తయారీ చేస్తూ కాలుష్యానికి కారణమవుతోన్న వైనాన్ని పరిశీలించారు. కాలుష్య నియంత్రణ బోర్టు ధృవపత్రం సహా పలు లైసెన్సులు తీసుకోకుండా ఒకే చోట మూడు సంస్థలను నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే పరిశ్రమలో ప్లాస్టిక్ ఉత్పత్తిని నిలిపివేశారు.