ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కృష్ణా ఎస్పీ - krishna district sp latest news

పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. పామర్రు, జుజ్జవరంలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

sp visit polling centers
కృష్ణా జిల్లా ఎస్పీ

By

Published : Apr 7, 2021, 9:05 PM IST

కృష్ణా జిల్లా పామర్రు, జుజ్జవరం ప్రాంతాల్లో.. ఎన్నికలు జరగనున్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. రేపు జరగనున్న పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 4,500 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. జిల్లా పోలీసు సిబ్బందితో పాటు విజయవాడ సిటీ పోలీస్, సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తుకు ఎక్కువ సిబ్బందిని కేటాయించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు.. బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details