ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక'' - కృష్ణా జిల్లా ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు సంఖ్య గణనీయంగా తగ్గించి.. కృష్ణా జిల్లాను ప్రమాదాలు లేని జిల్లాగా మారుస్తామని ఎస్పీ రాజేంద్రనాథ్ తెలిపారు. ఠాణాల వార్షిక తనిఖీల్లో భాగంగా కంచికచర్ల పోలీసు స్టేషన్​ను ఆయన పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టినట్లు పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్

By

Published : Sep 13, 2019, 10:47 PM IST

కృష్ణా జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్

కృష్ణా జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని, మావోయిస్టుల కదలికలు లేవని జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్ తెలిపారు. ఠాణాల వార్షిక తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్​ను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం మాట్లాడిన ఆయన.. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే... ఎవరికీ అధిక జరిమానాలు వేయబోమన్న ఆయన... వాహన చోదకుల కోసమే చట్టాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details