కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంత క్వారీల యజమానులతో ఎస్పీ రవీంద్ర బాబు సమావేశమయ్యారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్న ఎస్పీ... మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలోనే పేలుళ్లు చేయాలని సూచించారు. కొంత మంది ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లోనూ బ్లాస్టింగ్కి పాల్పడుతున్నారని చెప్పారు.
మహేశ్వరి స్టోన్ క్వారీలో ఎలాంటి అనుమతులు లేని మెటీరియల్ ఉండటంపై వారిమీద క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. వారికి మెటీరియల్ సరఫరా చేసిన ఈశ్వరి ఎంటర్ప్రైజెస్ యజమానిపైనా కేసు నమోదు చేసి.. రిమాండ్కు పంపుతామని చెప్పారు. అనుమతులు లేకుండా పేలుళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.