కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కుంటముక్కల క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. రెడ్డిగూడెం మండలం బూర్గుగూడెం గ్రామానికి చెందిన దాసరి రాధాకృష్ణ , అరుణ దంపతులు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వీరిని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. గాయపడిన టిప్పర్ చోదకుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో దంపతుల దుర్మరణం - road acident in krishna district
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం