''మమ్నల్ని తొలగించకండి.. రోడ్డున పడతాం'' - cm jagan
రేషన్ వ్యవస్థను తొలగిస్తారన్న ఊహాగానాలపై.. చౌక ధరల దుకాణాల నిర్వాహుకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు.
ration dealers
రేషన్ డీలర్ల వ్యవస్థను తొలగించవద్దని.. ఉపాధి లేక కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తుందని కృష్ణా జిల్లా చౌక ధరల దుకాణ డీలర్లు ప్రభుత్వాన్ని కోరారు. 60 ఏళ్లుగా ఉన్న వ్యవస్థను రద్దు చేయొద్దని ఐక్య కార్యాచరణ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయమై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థకు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు.