కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో... న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన లోక్ అదాలత్‌ను జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణమూర్తి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 27 న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మచిలీపట్నంలో మూడు బెంచ్‌లు ఏర్పాటు చేయగా 8,263 కేసులను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు న్యాయమూర్తి వై.లక్ష్మణమూర్తి తెలిపారు. కేసుల సత్వర పరిష్కారం కోసం, రాజీ మార్గంలో పరిష్కారం పొందేందుకు ఈ లోక్ అదాలత్‌లు ఎంతో ఉపకరిస్తున్నాయని న్యాయమూర్తి వివరించారు.
'కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఉపకరిస్తాయి' - krishna district crime
కృష్ణా జిల్లాలోని న్యాయసేవా సదన్‌లో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణమూర్తి ప్రారంభించారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్‌లు ఉపకరిస్తాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణమూర్తి