ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధుల్లో అలసత్వం..ఐదుగురు వాలంటీర్లు తొలగింపు - విజయవాడ డివిజన్ కలెక్టర్ తాజా వార్తలు

కోవిడ్ నియంత్రణ, ప్రజారోగ్య సంరక్షణలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వ్యవహరించకపోవడంతో ఐదుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధ్ది) ఎల్. శివశంకర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు.

krishna district jc
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధ్ది) ఎల్.శివశంకర్

By

Published : Jun 12, 2021, 9:36 PM IST

కోవిడ్ నియంత్రణలో ప్రజారోగ్య సంరక్షణలో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించే వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధ్ది) ఎల్.శివశంకర్ హెచ్చరించారు. విజయవాడ డివిజన్​లోని కోవిడ్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 12వ ఫీవర్ సర్వేలో కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వ్యవహరించని కారణంగా ఐదుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని తెలిపారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details