సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 843 ప్రత్యేక బస్సులు నడుపగా 81 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)తో రూ.2 కోట్లు ఆదాయం వచ్చినట్లు కృష్ణా రీజనల్ మేనేజర్ జి.నాగేంద్రప్రసాద్ తెలిపారు. పండగ తరువాత 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజులు విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నంలకు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, అవనిగడ్డ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుంచి హైదరాబాద్ విశాఖపట్నంలకు 300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు.. - ఏపీఎస్ ఆర్టీసీ తాజా వార్తలు
సంక్రాంతి పండుగ ఏపీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. 81 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)తో ఒక్క కృష్ణా రీజీయన్ నుంచే దాదాపు 843 ప్రత్యేక బస్సులను ఇతర రాష్ట్రాల నుంచి నడిపించారు. తిరిగు ప్రయాణంలో కూడా 300 పైగా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేశామని దీంతో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు
సంక్రాంతి సెలవులు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. శనివారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి హైదరాబాద్‌కు 56 బస్సులు, ఆదివారం బెంగళూరు, చెన్నై, అనంతపురంలకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: సంక్రాంతి కళ... ఆదాయం భళా!