ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బాలురతో సమానంగా బాలికలకు అవకాశాలు కల్పించాలి'

కృష్ణా జిల్లా కానూరులో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాలురతో సమానంగా బాలికలకు అవకాశాలు అనే నినాదంతో ఈ ఏడాది సాగాలని కలెక్టర్ అన్నారు. దిశ చట్టం ద్వారా బాలికలకు రక్షణ కల్పిస్తునట్లు ఆయన తెలిపారు. బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

By

Published : Oct 11, 2020, 8:32 PM IST

Published : Oct 11, 2020, 8:32 PM IST

Krishna collector imtiaz
Krishna collector imtiaz

అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కానూరులో... జిల్లా బాలల పరిరక్షణ విభాగం, వరల్డ్ విజన్ ఇండియా చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పోలీసు ఉన్నతాధికారులు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 'బాల్యవివాహాలు ఆపండి' అనే పోస్టర్ సహా మానసిక వికాసానికి ఉపయోగపడే పలు పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. బ్రూణ హత్యల నివారణ, బాలికల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

జిల్లాలో బ్రూణ హత్యలు, బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. దిశ చట్టం ద్వారా బాలికలకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలురతో సమానంగా బాలికలకు అవకాశాలు ఇవ్వాలనేది ఈ ఏడాది నినాదమని.. దీన్ని అందరూ పాటించాలని కోరారు. దిశ యాప్​ను మహిళలంతా డౌన్​లోడ్ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు.

ఇదీ చదవండి :వెదర్​ అప్​డేట్​: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ABOUT THE AUTHOR

...view details